సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం

0
5

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 16 మందికి గాయాలయ్యాయి.

డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సు డోర్ రాకపోవడంతో అత్యవసర ద్వారం (Emergency Door) ద్వారా ప్రయాణికులు బయటపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.