పుంగనూరు మండలం బండ్లపల్లి పంచాయతీ నల్లూరు పల్లి గ్రామంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జెండా, బోర్డు ఆవిష్కరణ, ముందస్తు జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.
శంకరప్ప పిలుపు మేరకు ప్రజా, దళిత సంఘాలు పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. కులమత బేధాలు లేకుండా 14న జరగబోయే అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని శంకరప్ప విజ్ఞప్తి చేశారు# కొత్తూరు మురళి.










