పుంగనూరు పట్టణంలో శుక్రవారం వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొద్దిరోజులుగా వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు.
అయితే, వర్షం కారణంగా పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లపై గుంతల్లో నీరు చేరడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది కొత్తూరు మురళి.










