పూలే జయంతి: ఆల్వాల్ ప్రెస్ క్లబ్ భూమిపూజ.

0
2

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న ఆల్వాల్ ప్రెస్ క్లబ్ భవనానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. రెండు అంతస్తులతో నిర్మించే ఈ భవనం జర్నలిస్టులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju