శనివారం బోరెడ్డిగారిపల్లిలోని తన స్వగృహంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యలు తీర్చడమే తన బాధ్యతని, పేదరికం లేని సమాజం నిర్మించడమే కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, నేతలు ఆయనను సత్కరించారు










