రాయచోటిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, యువ నాయకులు మౌర్య రెడ్డి ఘనంగా నిర్వహించారు. మాసాపేట బ్రిడ్జి వద్ద పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల సమానత్వం, మహిళా విద్య కోసం పూలే చేసిన కృషిని మంత్రి కొనియాడారు.
1848లోనే బాలికల కోసం తొలి పాఠశాల స్థాపించిన ఆయన ఆశయ స్ఫూర్తితోనే దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.










