మంచిర్యాల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న మేయర్.

0
1

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్‌లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చొరవతో నిర్మించిన ఈ ఇంటిని మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సళ్ళ రమ్య మహేష్ ప్రారంభించారు.

లబ్ధిదారులు కామెర స్నిగ్ధ కిరణ్ కుమార్ కుటుంబానికి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మేయర్ పేర్కొన్నారు.