మదనపల్లి జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాల ద్వారా పౌష్టికాహారంపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. ఈనెల 23 వరకు అంగన్వాడీ కేంద్రాలు, పంచాయితీల ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
పిల్లల జననం నుంచి రెండు సంవత్సరాల లోపు 1000 రోజులు కీలకమని, ఈ దశలో సరైన పోషకాహారం అవసరమని, పౌష్టికాహారం లోపం పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. జంక్ ఫుడ్, అధిక ఉప్పు-నూనె వినియోగం హానికరమని హెచ్చరించారు.










