శ్రీకాకుళం – తిరుపతి రెగ్యులర్ రైలు సర్వీసు ప్రారంభం.

0
0

శ్రీకాకుళం జిల్లా ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, తిరుపతికి రెగ్యులర్ రైలు (హంసఫర్ ఎక్స్‌ప్రెస్) సర్వీసు ప్రారంభం కానుంది. ఏప్రిల్ 13న ఈ రైలును ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది.

ప్రతి ఆదివారం తిరుపతి నుండి, సోమవారం శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి ఈ రైలు నడుస్తుంది. ఇది ఉత్తరాంధ్ర భక్తులకు శ్రీవారి దర్శనానికి ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. జిల్లా అభివృద్ధిలో ఇదొక చరిత్రాత్మక ఘట్టమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.