మదనపల్లె మండలం తట్టివారిపల్లె చెరువు వద్ద ఆదివారం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కొత్తపల్లి పంచాయతీ రంగారెడ్డికాలనీకి చెందిన శంకర్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో నీటి తొట్టిలో పడి మరణించాడా లేక తలకు గాయాలతో మరణించాడా అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.










