మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని *32 వ డివిజన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,గౌతమి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,హైటెక్ సిటీ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ మలక్ పేట్ వారి సౌజన్యంతో స్థానిక సురక్ష హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం* జరిగింది.పేద ,మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవను అందించాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ వారిని యశోద హాస్పిటల్ వైద్యులను మేయర్ అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు కార్యక్రమ నిర్వాహకులు లయన్ ఉస్కమల్ల రాజేంద్ర ప్రసాద్ ,లయన్స్ క్లబ్ సభ్యులు,యశోద హాస్పిటల్ వైద్యులు,స్థానిక సురక్ష హాస్పిటల్ వైద్యులు,సిబ్బంది స్థానిక కాంగ్రెస్ నాయకులు,స్థానికులు పాల్గొన్నారు










