మంచిర్యాల 6 వ వార్డ్ లో శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత లో మంచిర్యాల మేయర్

0
0

మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ దర్నీ మధుకర్ ఆధ్వర్యంలో చేపట్టిన మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక 06 వ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ పర్యవేక్షించారు.స్థానికులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకొని సిబ్బందికి తగిన సూచనలు తెలియచేయడం జరిగింది. అనంతరం డివిజన్ కార్పొరేటర్ మరియు స్థానిక ప్రజలు మేయర్ శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు 06 వ డివిజన్ కార్పొరేటర్ వనపర్తి కేతన రాజేష్ డివిజన్ సీనియర్ నాయకులు మున్సిపల్ డివిజన్ అధికారి,సిబ్బంది మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు ,ప్రజలు పాల్గొన్నారు