మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టిడిపి కార్యాలయంలో ఘన నివాళులు సుగవాసి ప్రసాద్ బాబు

0
0

రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది భారతదేశ సామాజిక న్యాయ ఉద్యమానికి పునాది వేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్ లో ఉన్న టిడిపి కార్యాలయంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా ఇవాళ అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే గారు విద్య సమానత్వం మహిళా సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని అన్నారు విద్య నిజమైన ఆయుధమని నినదించి సమాజాన్ని చైతన్యపరిచిన గొప్ప దార్షానికుడు పూలే గారిని కొనియాడారు 1873లో స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ద్వారా కుల వివక్ష అంటరానితనం వంటి దుష్ప్రవర్తనాలపై పోరాటానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు మహిళా శక్తి ని ప్రోత్సహిస్తూ భార్య సావిత్రిబాయి పూలే గారిని తొలి మహిళా ఉపాధ్యాయుడిగా నిలిపిన ఘనత ఫూలే గారిది అని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు