శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ జట్టుకు ఎంపిక.

0
0

మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి జి. శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ఎంపికై, ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు వెళ్లనున్నారు. స్కూల్ గేమ్స్ లో భాగంగా 2025 నవంబర్ లో కాకినాడలో జరిగిన అండర్ 14 రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఈ ఎంపిక జరిగింది. ఏప్రిల్ 26 నుండి 22 వరకు న్యూ ఢిల్లీలో జరిగే జాతీయ స్కూల్ గేమ్స్ స్క్వాష్ పోటీలలో శశాంక్ రెడ్డి పాల్గొంటారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, శిక్షణ ఇచ్చిన వ్యాయామ సహాయకులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.