మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ కు చెందిన ఏకారి లిఖిత జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికైన సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ లిఖితను మరియు వారి తల్లితండ్రులను సన్మానించి ఆమెను అభినందించరు .నిరుపేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ ,తల్లి తండ్రుల ప్రోత్సాహంతో మొక్కవోని దీక్షతో ఈ రోజు జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికవటం పట్ల మేయర్ హర్షం వ్యక్తం చేశారు, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు 8 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అట్కపురం సతీష్, నరిగె నరేష్, బీమిని రాజేష్ మూట విజయ్,మూట శేఖర్ స్థానికులు పాల్గొన్నారు.










