అల్వాల్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్హెచ్ఓ ప్రశాంత్ మరియు ఎస్సై రాఘవేందర్ రెడ్డి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు కీలకమని, మద్యం సేవించి వాహనం నడపడం మరియు అతివేగం ప్రాణాంతకమని వారు హెచ్చరించారు. పాదచారులు జీబ్రా క్రాసింగ్ ఉపయోగించాలని సూచించారు. అనంతరం, రహదారి నియమాలను పాటిస్తామని అధికారుల ఆధ్వర్యంలో ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ప్రమాద రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు కోరారు.
#Sidhumaroju










