“కిస్తమ్మ ఎన్‌క్లేవ్‌లో సమస్యలపై స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
7

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిస్తమ్మ ఎన్‌క్లేవ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను తెలుసుకునేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి , టీపీ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి , యాదగిరి, సాజిద్, మహేందర్‌లతో కలిసి ప్రాంతాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పార్క్ అందీకరణ, చెట్ల కొమ్మల తొలగింపు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు వంటి అవసరాలను ప్రజలు వివరించారు.

ప్రజల సమస్యలను స్థలంలోనే పరిశీలించిన మాజీ కార్పొరేటర్, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి వీలైనంత త్వరగా పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనతో స్థానికులకు నమ్మకం పెరిగిందని నివాసితులు తెలిపారు.

#Sidhumaroju

Alwal