మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ఘనంగా ప్రారంభమైంది. ఎం.పి లాడ్స్ ఫండ్స్ మరియు కాలనీ సభ్యుల సహకారంతో నిర్మితమైన ఈ హాల్‌ను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి మాట్లాడుతూ, కాలనీ అభివృద్ధికి ఇలాంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. స్థానిక ప్రజల ఐక్యతతో ఈ కమిటీ హాల్ నిర్మాణం సాధ్యమైందని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నారాయణ, బీజేపీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
స్థానికులకు సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ కమిటీ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
#sidhumaroju










