క్యాతనపల్లిలో ప్రజాస్వామ్యం గెలిచింది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ : కె టి ఆర్

0
5

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాతనపల్లిలో ఉంటే తమ ఆటలు సాగవని భావించి, ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆసిఫాబాద్, మంచిర్యాల సబ్ జైలు కాకుండా ఏకంగా ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.

కనీసం మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా ఇవ్వకుండా జైల్లో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందారని క్యాతనపల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవడం కోసం మంత్రి వివేక్ ఎన్ని ఇబ్బందులు పెట్టిన,ఎంత భయపెట్టినా బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు లొంగలేదని మొక్కవోని ధైర్యంతో అధికార బలానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని కె టి ఆర్ అన్నారు