మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ప్రేమ పేరుతో మోసాలు వంటి వివిధ సమస్యలపై ఆయన విచారణ చేపట్టారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు










