తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పర్యటించారు. గోదావరిఖనిలో రూ. 12.29 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పోలీస్ క్వార్టర్స్‌ను ఆయన ప్రారంభించారు.
అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో “వేగం కన్నా ప్రాణం ముఖ్యం” అని పేర్కొంటూ, రోడ్డు ప్రమాదాల నివారణకు “అరైవ్… అలైవ్” (Arrive Alive) కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి అధికారి అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యపరచాలని డీజీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు.










