అల్వాల్ : తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంత రావు సూచనల మేరకు శివనగర్ కాలనీ కమిటీ సభ్యులు అల్వాల్ మున్సిపల్ ప్రజావాణి కార్యక్రమంలో డీసీని కలిసి కాలనీలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో 194 డివిజన్ అధ్యక్షుడు మల్లెల శివ, ఏ బ్లాక్ అధ్యక్షుడు కేబుల్ శేఖర్, మాజీ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి, మాజీ డీసీసీ జనరల్ సెక్రటరీ కృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.అలాగే శివనగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణతో పాటు వెంకట్, కార్తీక్, నరసింహ మరియు ఇతర కాలనీ సభ్యులు హాజరయ్యారు.
#sidhumaroju










