బొల్లారం గ్రౌండ్‌కు ఇంటర్నేషనల్ టచ్.|

0
4

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొల్లారం ప్రాంతంలోని ప్రముఖ క్రీడా ప్రాంగణం త్వరలోనే కొత్త రూపు సంతరించుకోనుంది.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం నియోజకవర్గంలోని బొల్లారం సదర్ బజార్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ గ్రౌండ్‌ను సందర్శించి, అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసిన ఈ చారిత్రాత్మక గ్రౌండ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ, అత్యధిక నిధులు కేటాయించి ఈ ప్రాంగణాన్ని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ఈ గ్రౌండ్ నుంచి మరిన్ని అంతర్జాతీయ క్రీడాకారులు వెలువడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, నియోజకవర్గానికి ఇది ఒక మోడల్ క్రీడా ప్రాంగణంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju