భాగంగా హెల్మెట్ల పంపిణీ – “పోలీసులు మీకోసం”లో ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు

0
5

తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి కుమురం భీమ్ జిల్లా జోడేఘాట్‌లో పర్యటించారు. ముందుగా ఆదివాసి వీరుడు కొమురం భీం విగ్రహానికి నివాళులర్పించిన ఆయన, అనంతరం “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా 1000 మందికి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు.

అలాగే “పోలీసులు మీకోసం” పథకం కింద 50 మంది ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీల సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.