కనెక్టివిటిని పెంచడం ద్వారా లాజిస్టిక్ హబ్గా శ్రీకాకుళంను మార్చుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం పరిధిలోని పెద్దపాడు దగ్గర చెన్నై – కలకత్తా నగరాలను కలిపే కీలకమైన జాతీయ రహదారిలో కల్వర్ట్ నిర్మాణానికి ఎమ్మెల్యే గొండు శంకర్తో కలసి శంకుస్థాపన చేశారు.










