ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సంక్షేమ సంఘం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం) యొక్క ప్రధమ వార్షికోత్సవానికి రావాల్సిందిగా కోరుచూ, ఆహ్వాన పత్రికను బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ కు అందిస్తున్న మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.
కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు, బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, సీనియర్ మాజీ సైనికులు అబ్దుల్ రజాక్, రుక్మదర రావు, జంపని శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు.










