ఆర్పీలకు రూ. 24 వేల జీతం ఇవ్వాలంటూ నిరసన.

0
0

మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సోమవారం రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) నిరసన ధర్నా చేపట్టారు. మున్సిపల్ మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న సుమారు 70 మంది ఆర్పీలకు నెలకు రూ.

24,000 జీతం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 2007 నుంచి సేవలు అందిస్తున్నా ప్రస్తుతం కేవలం రూ. 8,000 మాత్రమే జీతం ఇస్తున్నారని, పెరుగుతున్న పని భారం దృష్ట్యా తమకు తగిన వేతనం పెంచాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.