గంగా అవెన్యూలో ₹24 లక్షల కాంపౌండ్ వాల్ శంకుస్థాపన.

0
13

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, మచ్చబొల్లారం పరిధిలోని గంగా అవెన్యూలో ఖాళీ స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం, మైనంపల్లి హనుమంతరావు ప్రోత్సాహంతో మంజూరైన సుమారు రూ. 24 లక్షల అంచనా వ్యయంతో చేపట్టారు.

ఈ కార్యక్రమంలో గంగా అవెన్యూ RWA అధ్యక్షుడు జోసెఫ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రెహ్మాన్ మరియు సమీప కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, లడ్డూ రెడ్డి తదితరులు హాజరై పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ గోడ నిర్మాణం స్థానిక స్థల రక్షణకు దోహదపడనుంది.

#sidhumaroju