దౌర్జన్య ఘటనలపై చర్యలు తీసుకోవాలి : మదనపల్లి ఎమ్మెల్యే

0
1

ఆదివారం నాడు టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి శాంతిభద్రతలకు భంగం కలిగించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ భాష పోలీసులకు సూచించారు. బాధితుడు శ్రీనివాసరావుతో కలిసి ఆయన తాలూకా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ఫిర్యాదు చేశారు.

#MLAShahjahanBashaఈ సందర్భంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.