పుంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న కాలనీలో పారిశుద్ధ్యం లోపించిందని స్థానిక ప్రజలు ఆదివారం తెలిపారు. కాలనీలో మురికి నీరు, చెత్తతో అవస్థలు పడుతున్నామని, తమ కాలనీ వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని వాపోయారు. చెత్త ఎక్కువ కావడం వల్ల దోమలు పుట్టుకొచ్చి అనారోగ్యం పాలవుతున్నామని, మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు# కొత్తూరు మురళి.










