మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని మరోసారి నిరూపించారు.
ఈరోజు ఆయన క్యాంపు కార్యాలయంలో, అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ (LOC) కు దరఖాస్తు చేసుకున్న అల్వాల్, జొన్నబండ ప్రాంతానికి చెందిన రాజు కి మంజూరైన రూ.2,00,000/- (రెండు లక్షల) విలువైన ఎల్ఓసి పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో పెద్ద ఆధారంగా నిలుస్తుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా సహాయం అందేలా తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, లక్ష్మణ్ యాదవ్, పవన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










