ఫేక్ డాక్యుమెంట్లతో భూమి కబ్జా… కలెక్టరేట్‌లో ఫిర్యాదు.

0
0

అన్నమయ్య జిల్లా: మదనపల్లి కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్‌లో బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారు. బి. కొత్తకోటలోని గట్టుకు చెందిన గౌష్ ఖాన్ పేరుతో ఉన్న భూమిని మొటుకుపల్లి శివ నకిలీ పత్రాలతో కబ్జా చేశాడని, భూమిని చదును చేస్తూ ఆక్రమణను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు.

ఈ విషయంపై బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు తమ గోడును వినిపించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.