మదనపల్లె పోలీస్ సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా బి. పావని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2023 బ్యాచ్‌కు చెందిన ఆమెకు ఇది తొలి పోస్టింగ్. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ ధీరజ్ ను కలిసి విధుల్లో చేరినట్లు తెలిపారు. ఎస్పీ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు.
మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్రమ పార్కింగ్, రహదారి ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.










