“తెలంగాణ కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్.|

0
8

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ బాస్ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌కు ఈ కీలక బాధ్యతలు దక్కాయి.

గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మరియు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయనకు మంచి అనుభవం ఉంది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపిన ముగ్గురు అధికారుల జాబితా నుంచి ప్రభుత్వం ఆయన్నే తుది ఎంపిక చేసింది.

ఈ నియామకంతో మే 1వ తేదీ నుంచి ఆయన పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టి రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని ముందుండి నడిపించనున్నారు.

#sidhumaroju