భారత్ ఆవాజ్ న్యూస్: నర్సంపేట పట్టణంలోని పలు..కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం మొదలు సాయంత్రం వరకు 16 మందిని ఓ కుక్క గాయపరచడం కలకలం రేపుతోంది. గాయపడిన వాళ్లలో చిన్న పిల్లలు సహా యువత, వృద్ధులు సైతం ఉన్నారు. నర్సంపేట పట్టణంలోని గాంధీ బొమ్మ ప్రాంతంలో.
ఉప్పలయ్య హోటల్, జయశ్రీ టాకీస్, హనుమాన్ టెంపుల్ దగ్గరలో అకస్మాత్తుగా మనుషులపై దాడి చేసి గాయపరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క 29 వ డివిజన్లోనే 8 మందిని కుక్క గాయపరిచినట్లు స్థానిక కౌన్సిలర్ స్పష్టం చేయడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. మనుషులపైనే కాకుండా అడ్డచ్చిన ఒక బర్రెను, దూడను సైతం గాయపరిచినట్లు సమాచారం…. భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి రిపోర్టర్ జి. రాము…









