ఈరోజు(జూన్ 12న) లాంచింగ్
* జులై 5న చెల్లింపు
* G.O.26 & 27 ప్రకారం ఈరోజు రు.15000/- ఆర్థిక సహాయంను 1 నుంచి 12 వరకు గుర్తింపు పొందిన Govt/Pvt Aided/Pvt Unaided పాఠశాలల్లో చదువుచున్న పిల్లలు గల BPL Familyలోని తల్లుల ఖాతాలలోకి విద్యార్థికి ప్రభుత్వం ₹13000/- చొప్పున నికర జమచేస్తుంది. ఒక విద్యార్థి ఇచ్చే ₹15000/-లలో రు.2000/-లను పాఠశాల మెయిన్టెనెన్స్ కు మినహాయించి మిగతా ₹13000/- తల్లి బ్యాంకు ఖాతాలోకి జమవుతుంది.
* 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఆరంభం.
* 2025-26 విద్యా ఏడాదిలో హాజరుతో సంబంధం లేకుండా చెల్లించబడును.
* 2025-26లో 75% హాజరు ఉన్నవారికే 2026-27 ‘తల్లికి వందనం’కు అర్హులు.
* కుటుంబంలో ఒకరికైనా White Ration Card ఉండాలి.
* UDiseలో Dataను Head of the Institution వారు కరక్ట్ అని Ensure చేయాలి.
* పిల్లల తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ల ఆధార్ నెంబర్లు వాలిడేట్ అయి ఉండాలి.
* Total House hold Monthly Income గ్రామాలలో ₹10,000/- & పట్టణాలలో ₹12,000)- మించరాదు. మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించరాదు. పట్టణాలలో అయితే 1000 చ.అ స్ధలము ఉండరాదు. House Hold Membersలో ఏ ఒక్కరికీ 4 Wheeler ఉండరాదు.
* సరాసరి నెలకు 300 యూనిట్ల మించి విద్యుత్ వినియోగం ఉండరాదు.
* House Hold Member ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు.
* ఫీజు రీయంబర్స్మెంట్ సదుపాయం ఉన్న IIIT, Poly Technic కోర్సుల్లో చదివే పిల్లల తల్లులు అనర్హులు.
* 2025-26 విద్యా సంవత్సరంనకు 1 నుంచి 12 తరగతులలో ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ ఆర్థిక సాయం పరిశీలించబడును.
* RTE ACT-12(1)(c) కింద Private Schoolsలో చేరిన వారికి ఆయా పాఠశాలల యాజమాన్యాలకు SPD ద్వారా ఫీజు కింద టీవీ అందిస్తారు, మిగిలిన ఫీజు RTE Act ప్రకారం చెల్లింపు జరుగును.
* తల్లి లేకపోతేనే తండ్రికి, ఇద్దరూ లేకపోతే ఆధార్ గార్డియన్కు చెల్లించబడును. అనాథ బాలలకు జిల్లా కలెక్టర్ ద్వారా చెల్లించబడును.
* G.O.27లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం జూన్ 12 నుంచి 28వరకు అర్హులైన తల్లులు/తండ్రులతో విద్యార్థుల జాబితా తయారుచేసి 1 నుంచి ఇంటర్ వరకు చదువుచున్న అర్హులైన విద్యార్థుల తుది జాబితాను ఈ నెలాఖరులోగా గ్రామ/వార్డు సచివాలయాలలో ప్రదర్శిస్తారు.
* జులై 5న తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు జమగును.