ఆత్మకూరులో పట్టపగలే భారీ చోరీ

0
3

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబానగర్ లో సోమవారం పట్టపగలే ఇంట్లో చోరి జరిగింది. ఈ చోరీలో ఇంట్లో ఉన్న నగదు రూ.20 లక్షలు, బంగారు 65 తులాలు చోరికి సమాచారం. ఆత్మకూరు చెందిన వెలుగోడు తెలుగు గంగ ప్రాజెక్టులో ఏఈఈగా పనిచేస్తున్న శరభారెడ్డి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. శరమారెడ్డి విధుల నిమిత్తం నంద్యాల వెళ్ళగా ఇంట్లో కుటుంబ సభ్యులు వైయస్సార్ స్మృతి వనంలో ఫోటో షూటింగ్ కోసం వెళ్లారు. ఏఈఈ పనిచేస్తున్న శరభారెడ్డి కుమార్తె వివాహం గత నెలలో జరగడంతో ఈ రోజు ఫోటో షూటింగ్ కోసం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు బంగారం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు సీఐ రాము చోరీ జరిగిన ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. నంద్యాల నుంచి క్లూస్ టీమ్, కర్నూల్ నుండి డాగ్ స్క్వాడ్ వచ్చి ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన ఇంట్లో నుంచి బయలుదేరిన డాగ్ స్క్వాడ్ హైవే వైపు వెళ్ళింది