సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భాధితుల కోసం ఏకంగా రోడ్డు ప్రక్కన ఉన్న మురుగు కాల్వపై కూర్చోని వారి భాధలు విని భాధితుల నుంచి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వినతులు స్వీకరించారు.
గురువారం సాయంత్రం నంద్యాల టెక్కె భారతమాత మందిరం రోడ్డులోని విహెచ్ పి కార్యాలయం ముందు రోడ్డు ప్రక్కన మురుగుకాల్వపై ఉన్న బండపై కూర్చోని ఆళ్లగడ్డ, పాణ్యం, శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల నుంచి తన కోసం వచ్చిన వారి నుంచి వినతి పత్రాలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తీసుకొని కొన్ని వినతుల వారి కి సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కారం చూపారు. మరికొన్ని వినతులు సంబంధిత అధికారులకు పంపి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కొందరు ఎంపీ లెటర్ కావాలని కోరగా పి ఎ గణేష్ ద్వారా లెటర్లు ఇచ్చే ఏర్పాట్లు చేశారు.
ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రోడ్డు ప్రక్కన మురుగు కాల్వపై కూర్చోని వినతులు తీసుకుంటుండగా రోడ్డు వెంట వెళ్లేవారు ఆగి ఎంపీ శబరిని చూసి ఆచ్చర్యం వ్యక్తం చేయగా, మరి కొందరు ఎంపీ బైరెడ్డి శబరితో ఫోటోలకు పోటీపడ్డారు.