కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యేశ్రీగణేష్ భేటీ

0
6

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యి నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను ఎమ్మెల్యే సీఈఓ తో  చర్చించారు. ప్రధానంగా మర్రి రాంరెడ్డి కాలనీలో వర్షాకాలం నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుండి వచ్చే వర్షపు నీటితో ముంపునకు గురవుతున్న తరుణంలో నాల విస్తరణ పనులు చేపట్టి ముంపు ప్రాంతాలకు విముక్తి కలిగించాలని అన్నారు. దోబీ ఘాట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి కంటోన్మెంట్ నుండి లేఖ రాయడంపై జాప్యం చేయవద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి చేసే అభివృద్ధి పనుల విషయంలో కంటోన్మెంట్ బోర్డు ఎన్ఓసి విధానాన్ని సడలించాలని కోరారు. తిరుమలగిరి చెరువు, బోయిన్ పల్లి రామన్న కుంట చెరువుల సుందరీ కరణ పనులు వేగవంతం చేయడంతో పాటు పాలనాపరమైన అనుమతుల విషయంలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో వెటర్నరీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఈవో ను కోరారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డు కు వచ్చే 303.62 కోట్ల రూపాయల నిధులకు ఎన్ఓసి మంజూరు చేయాలని కూడా  సీఈఓ ను కోరడం జరిగింది.