ఇటీవల అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారు.
చోరీకి పాల్పడ్డ కౌశిక్, రవితేజలను అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు నిందితుల నుండి 9 లక్షల విలువైన 12 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం, ఒక సుత్తె స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీర్ బాద్ ఏసిపి రాములు తెలిపారు.
హస్మత్ పెట్ కు చెందిన కౌశిక్, ఎల్బీనగర్ కు చెందిన రవితేజలు తొమ్మిదవ తరగతి వరకు కలిసి చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చదువు మానేసి ఒకరు బట్టల షాపులో సేల్స్ మెన్ గా, మరొకరు స్వీపర్ గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈనెల 27న కౌశిక్, రవితేజలు ఓ ఫంక్షన్ లో కేటరింగ్ పనికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. పని ముగించుకొని మద్యం సేవించి దొంగతనం చేయాలని నిర్ణయింpolice#చుకుని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి లక్ష్మీ నగర్ కాలనీలో తాళం వేసి ఉన్నా ఇంట్లో తాళాలు పగలగొట్టి అల్మారా లో ఉన్న విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుని పారిపోయినట్లు తెలిపారు.
దాదాపు 100 సిసి కెమెరాలు పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొని కానాజీ గూడలో వారిని పట్టుకున్నట్లు పేట్ బషీర్ బాద్ ఏసిపి రాములు పేర్కొన్నారు.