కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ కి హాజరైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన ఈటల :
Ghmc పరిధిలో పార్కులతో సుందరంగా ఉండే ప్రాంతం కంటోన్మెంట్.
లాల్ బజార్లోని గాంధీ ఆడిటోరియం గరీబొళ్లు పెళ్లిచేసుకునే అడ్డాను.. దానిని డంప్ యార్డ్ చేశారు. దానిని వెంటనే షిఫ్ట్ చేస్తామని హామీ ఇచ్చాం, చేస్తాము.
కంటోన్మెంట్ లో ఇళ్ళు కట్టుకోవడానికి ఇప్పుడు ఉన్న నిబంధనలు మార్చేందుకు కేంద్రం అనుమంతించింది. కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపించాలని బోర్డును కోరాము.
బోర్లకు కరెంటు బిల్లులు కంటోన్మెంట్ బోర్డ్ కట్టి ప్రజలకు నీళ్ళ సమస్య లేకుండా చేయాలని సూచన చేయడం జరిగింది.
ఢిల్లీలో కేంద్ర రక్షణశాఖమంత్రిని కలిశాము.. సఫాయి కార్మికులకు కారుణ్యనియామకాలలో 5 శాతం ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని, కరోనా సమయంలో చెనిపోయిన వారి కుటుంబాలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరడం జరిగింది. ఆ పేదలందరికీ కంపాషినేట్ పోస్టింగ్స్ అందిస్తాం.
మిలటరీలలో పనిచేయడానికి ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చిన వారికి 60 గజాల స్థలాలు లీజుకు ఇచ్చారు. వారికి పదే పదే నోటీసులు ఇస్తున్నారు. ఇల్లు కూలగొడతామని అంటున్నారు. అలాంటి పిచ్చి పనులు చేయవద్దని చెప్పాము.