సికింద్రాబాద్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జీఆర్పీ పోలీసుల చేసిన తనిఖీలలో 7వ ప్లాట్ ఫారం పైన 26లక్షల విలువైన 52కిలోల గంజాయి పట్టుబడిందని డీఎస్పీ ఎస్ ఎన్ జావేద్ తెలిపారు. 

0
26

ఎస్ఐ డీ రమేష్ ఆధ్వర్యంలో తనికీలు చేయగా ఫుడ్ కోర్టు పక్కన అనుమానాస్పద స్థితిలో పట్టుబడిన నాలుగు బ్యాగ్ లు పట్టుబడ్డాయని పేర్కొన్నారు. చుట్టుపక్కల బ్యాగులకు సంబంధించిన వ్యక్తుల గురించి వెతకగా ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పటం. మధ్యవర్తుల సమక్షంలో బ్యాగులు ఓపెన్ చేసి చూడగా వాటిలో మొత్తం 26 ప్యాకెట్ల గంజాయి ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ప్యాకెట్ 2కిలోల బరువు ఉన్నట్లు చెప్పారు. 52కిలోల గంజాయి లభించిందని, దీని విలువ సుమారు రూ 26లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు..