వీర హనుమాన్ విజయ శోభాయాత్ర గౌలిగూడ నుండి ప్రారంభమై సికింద్రాబాద్ తాఢ్ బంద్ వద్ద విజయవంతంగా ముగిసింది. పెద్ద ఎత్తున భజరంగ్ దల్,హిందూ వాహిని,విశ్వహిందూ పరిషత్,హిందూ ధార్మిక సంఘాలు శోభాయాత్ర లో పాల్గొన్నారు. పోలీసుల పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి శోభాయాత్ర పూర్తి చేశారు. హనుమాన్ భక్తులు హిందూ ధర్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హనుమాన్ భక్తి పాటలతో పాటు, డీజే హోరు నడుమ ఉత్సాహవంతంగా శోభాయాత్ర సాగింది. హనుమాన్ విగ్రహాలను ఊరేగిస్తూ కాషాయ జెండాలతో తాడ్బంద్ ప్రాంతమంతా కాషాయ శోభను సంతరించుకుంది.