నీలి గొడుగు దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనిసెఫ్ సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ.

0
11

సికింద్రాబాద్.. ప్రపంచంలో మగవారిపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నీలి గొడుగు దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనిసెఫ్ సంస్థ ఆధ్వర్యంలో జేబీఎస్ నుండి సికింద్రాబాద్ వైఎంసిఏ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్తర మండల అదనపు డీసీపీ పగడాల అశోక్, యూనిసెఫ్ ప్రతినిధి పర్వతాలు, చిన్నారులు పాల్గొన్నారు. ప్రపంచంలో చిన్న వయసులో మగవారిపై జరుగుతున్న లైంగిక వేధింపులు అత్యాచారాలు రిపోర్టు కావడంలేదని అదనపు డీసీపీ అశోక్ అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించి ఫిర్యాదులు అందుతుందడంతోపాటు నిందితులకు పోక్సో చట్టం ద్వారా జైలు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. ఎన్ సి ఆర్ బి డేటా ప్రకారం 52 శాతం మైనర్ బాలురు,పురుషులపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. బాలురపై జరుగుతున్న అఘాయిత్యాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. ఫోక్సో చట్టం ద్వారా కూడా బాధితులైన పురుషులకు నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి పిల్లలకు న్యాయం జరగాలంటే తల్లిదండ్రులు పోలీసులకు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి వాటిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.