అల్వాల్: ఈరోజు ఆల్వాల్ డివిజన్లోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర్లో గల లేబర్ అడ్డా భవన నిర్మాణ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేసి
కార్మికుల హక్కులకు పోరాటం చేస్తామని భవన నిర్మాణ కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్కు అయ్యే ఖర్చులను ప్రతి ఒక్కరికి తానే భరిస్తానని తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.1886లో చికాగో లో పని గంటలు తగ్గించాలని జరిగిన ఒక నిరసన ఊరేగింపు పై అమెరికా పోలీసులు కాల్పులు జరిపారు. కార్మికులు నెత్తురు పారింది. నాటి అమరులను తల్చుకుంటూ ప్రతీ యేడు *అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని* జరుపుకుంటున్నాము.
ఆశ ,అంగన్వాడి, జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని కాంట్రాక్టు లేబర్స్ కి వేతనాల్లో జిఎస్టి పేరుతో జీతాలు తగ్గిస్తున్నారని వాటర్ వర్కులలో పని చేసే కార్మికులకు సమాన పనికి వేతనాల్లో వ్యత్యాసం చూపిస్తున్నారని తెలిపారు
కార్మికుల హక్కుల సాధనకై పోరాటం చేస్తామని తెలిపారు .ఈ యొక్క కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జాజుల బాలయ్య , బాల మల్లేష్, రమేష్, కార్మిక సంఘాల సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్ , ఢిల్లీ పరమేష్, శరణగిరి, అరుణ్ తేజ రావ్, పవన్, సురేష్, ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.