అల్వాల్ జీహెచ్ఎంసీ డీసీ శ్రీనివాస్ రెడ్డి తీరుపట్ల కార్పొరేటర్ సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు.. తన భర్తపై అక్రమ కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
అల్వాల్ లోని కానాజీ గూడలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అనిల్ కిషోర్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంపై డీసీ పిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆందోళన చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి చేరుకొని అక్రమ అరెస్ట్ ను ఖండించారు. అరెస్ట్ చేసిన అనిల్ కిషోర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో, పరిస్తితి చేజారిపోయే పరిస్థితి ఉన్నదని గ్రహించి పోలీసులు వదిలి పెట్టారు. తన భర్తపై కక్ష్యపూరితంగా పిర్యాదు చేసిన డీసీ పైన కార్పొరేటర్ సబిత పిర్యాదు చేశారు. సబిత పిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి డీసీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. డీసీ పైన కేసు నమోదు చేయకపోతే రేపు దళిత సంఘాల నాయకుల ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.