Friday, August 15, 2025
spot_img
HomeSouth ZoneTelanganaఎన్. రాంచందర్ రావ్, ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమొగుతోంది. ఇంతకీ ఈ ఎన్. రాంచందర్...

ఎన్. రాంచందర్ రావ్, ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమొగుతోంది. ఇంతకీ ఈ ఎన్. రాంచందర్ రావ్ ఎవరంటే..!

హైదరాబాద్ కు చెందిన నరపరాజు రాంచందర్ రావు రాజనీతి శాస్త్రంలో ఎంఏతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1980-82 వరకు భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1977-85 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా పనిచేశారు. 1980-85 వరకు ABVP నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1986-90 వరకు BJYM నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1999-2003 వరకు రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా పనిచేశారు. 2003-2006 వరకు రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్‌గా పనిచేశారు.2006-2010 వరకు నేషనల్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా పనిచేశారు.  2007-2009 వరకు బిజెపి (పూర్వపు ఎపి) అధికారిక వక్తగా పనిచేశారు. 2009-2012 వరకు బిజెపి రాష్ట్ర (పూర్వపు ఎపి) జనరల్ సెక్రటరీగా పనిచేశారు.  2012-2015 వరకు బిజెపి ముఖ్య వక్తగా ఎపి మరియు టిఎస్ గా పనిచేశారు. 2015 సంవత్సరంలో హైదరాబాద్-రంగా రెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా MLC ఎన్నికయ్యారు మరియు 2015-2021 వరకు ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. బిజెపి హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. సంఘ కార్యకర్త, ABVP నాయకుడు గా,BJYM నాయకుడిగా ఎమర్జెన్సీ సమయంలో ఏబీవీపీ విద్యార్థి విభాగంలో ఎంతో యాక్టివ్ గా ఉన్న రాంచందర్ రావు, డిగ్రీ చదివే సమయంలోనే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించాడు.  విద్యార్థిగా వివిధ అంశాలపై గళమెత్తి 14సార్లు అరెస్ట్ అయ్యాడు. బిజెపి యువ మోర్చా మొదటి స్టేట్ సెక్రటరీగా నియమితుడయ్యాడు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనరల్ సెక్రటరీగా, హైదరాబాద్ నగర బిజెపి అధ్యక్షుడిగా, బిజెపి జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పార్టీలో సుదీర్ఘ అనుభవం సంపాదించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పలుమార్లు బిజెపి తరఫున బరిలోకి దిగడంతో పాటు 2015లో ఎమ్మెల్సీగా గెలిచి మంచి పేరు సంసాదించారు. తెలంగాణ ప్రజల సమస్యలపై గళమెత్తారు, అన్నార్థుల గొంతుగా నిలిచారు. అవినీతిని నిలదీసే నైజం ఉన్న రాంచందర్ రావు. కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన రిపోర్ట్ నేపథ్యంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీలో సుదీర్ఘ అనుభవం,ప్రజా సమస్యలపై గళమెత్తే తత్వం, అవినీతిని నిలదీసే నైజం ఎవరికీ బెదరని ధైర్యం.. ఇప్పుడివే రాంచందర్ రావుకు బిజెపి తెలంగాణ రథసారథి పదవికి అర్హతలు గా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments