కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం

0
0

కర్నూలు ఎయిర్పోర్టులో కర్నూలు నుండి విజయవాడ విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీజి భరత్ ,బీసి జనార్దన్ రెడ్ది గారితో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు వర్చువల్ గా రామమోహన్ నాయుడు గారితో మాట్లాడుతూ కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం కావడం తో జిల్లా వాసుల కల నెరవేరిందన్నారు.. రాష్ట్రంలో సపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే ఇక్కడ విమాన సర్వీసులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సంవత్సరం లోనే ఇది సాధించుకోగలిగామన్నారు.. కర్నూలు ఎయిర్పోర్ట్ ను మరింతగా అభివృద్ధి చేసి విమానాశ్రయం రూపు రేఖలు మార్చడంతో పాటు నైట్ ల్యాండింగ్ సౌకర్యం కూడా కలిపించాలని కేంద్ర మంత్రి గారిని ఎంపీ నాగరాజు కోరారు.. ఈ కార్యక్రమం లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ,పాణ్యం ఎంఎల్ఏ చరిత ,జాయింట్ కలెక్టర్ నవ్య తదితరులు పాల్గొన్నారు