సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు పిలుపునిచ్చారు,,గూడూరు సిఐటియు మండల కమిటీ సమావేశం గూడూరు లోని సిఐటియు కార్యాలయంలో డివిజన్ కార్యదర్శి జే,మోహన్ అధ్యక్షతన జరిగింది,ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు మాట్లాడుతూ,కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్య భావోద్వేగాలలో కులాల మధ్య మతాల మధ్య భేదాభిప్రాయాలను సృష్టిస్తూ దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారని తెలిపారు, దేశంలో అవినీతి పెరిగిపోయిందని గత కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తూ దేశ ఐక్యతను విచ్చిన్నం చేస్తుందని 2014 ఎన్నికల ముందు కార్పొరేట్లతో కలిసి విస్తారంగా ప్రచారం చేసిన బిజెపి అధికారంలోనికి వచ్చిన తర్వాత ఎవరు చేయలేనంత అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను దేశం కోసం ధర్మం కోసం అని భక్తి పేరట భావోద్వేగాలకు గురిచేస్తూ ప్రజల దృష్టిని పక్క దారిని పట్టిస్తున్నదని,పెద్ద నోట్ల రద్దు,GST,ఒకే దేశం,ఒకే భాష,ఒకే సంస్కృతి ని మొదలుపెట్టి,దేశ సంపదను అంబానీ,అదానిలకు అప్పనంగా అప్పజెపుతుందని విమర్శించారు, కార్పొరేట్లకు ప్రభుత్వ సంస్థలను అప్పజెపడమే కాకుండా ప్రజలపై అనేక రకాల భారాలు వేస్తూ ప్రజలను అప్పులపాలు చేస్తూ మానసిక ధైర్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు, బ్రిటిష్ వాడి కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడి దారులకు కార్పొరేట్లకు దోచుకోవడానికి అడ్డంగా ఉన్నాయని రోజు రోజుకు కార్మిక చట్టాలను తూట్లు పొడుస్తూ కార్మిక కోడ్లను కార్మికులకు తెలియకుండానే అమలు చేస్తున్నారని అన్నారు, అంగన్ వాడి,ఆశ వర్కర్స్, వివో ఏ, ఆర్ పి, వీఆర్ఏ, హెల్త్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వకుండా పని ఒత్తిడి పెంచి ఉద్యోగాలు వదిలి పారిపోయే విధంగా ఒత్తిడి చేస్తున్నారని, హమాలి కార్మికులు అసంఘటిత కార్మికులు అనేక సంవత్సరాల నుండి సంక్షేమ బోర్డు కోసం పోరాటం చేస్తున్న పట్టించుకోకపోగా వారిపైనే నిర్బంధాలను విధిస్తూ పని హక్కు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ లు అమలులో రాష్ట్ర కూటమి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉన్నదని, రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులు 10 గంటలు పని విధానాన్ని అమలు చేయాలని తీర్మానించడం లేబర్ కోడ్ ల అమలులో ఇదొక భాగమని రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ కార్మికుల కడుపు కొట్టడానికి చూస్తున్నదని లేబర్ కోడ్లు అమలు చేస్తే కార్మిక ఉద్యమాలు మరింత పెరుగుతాయని, రాబోవు రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికులు తగిన బుద్ధి చెబుతారని, వారన్నారు, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లను రద్దుచేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని అన్నారు,
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే జులై 9న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చా
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు గుంటప్ప, మండల నాయకులు వెంకటేశ్వర్లు, దానమన్న, హమాలి కార్మికులు భూత రామాంజనేయులు, గజ్జలన్న, ఆర్ పి ఉద్యోగుల సంఘం నాయకులు భారతి, పార్వతి, ప్రభావతి, మున్సిపల్ కార్మిక సంఘం నాయకుడు శాంతన్న, తదితర కార్మికులు పాల్గొన్నారు