జీడిమెట్ల 132 డివిజన్ అంగడిపేట్ డీ-మార్ట్ వద్ద నిర్వాహకులు ఉదయశ్రీ, పద్మావతి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “తేజాస్ గ్రాండ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ ” అండ్ “కొంపల్లి రుచులు” ను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… భోజన ప్రియులకు అద్వితీయ నూతన రుచులను అందజేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా “కొంపల్లి రుచులు అండ్ తేజస్ గ్రాండ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్” పేరుగడించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కమలాకర్, వీరయ్య చౌదరి, సుధాకర్ గౌడ్, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, యేసు, నదీమ్ రాయ్, బాల మల్లేష్, చిన్నా చౌదరి, సాయిబాబా, జునైద్, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.